telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కెసిఆర్ సర్కార్ కు షాక్ : కరోనా వ్యాప్తిపై హైకోర్టు సీరియస్

కరోనా పరీక్షలు తగ్గడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఎక్కడ అమలు కావడం లేదని.. రాత్రి 1 గంటలకు ఫుడ్ దొరుకుతుందని హైకోర్టు సీరియస్ అయింది. నిబంధనల ఉల్లంఘనపై మాకు లేఖలు, ఇమెయిల్స్ వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. సరిహద్దుల్లో అంబులెన్స్ లను అడ్డుకోవడం దారుణమని…మీకు ఎవరు చెప్పారు.. అంబులెన్స్ లను అడ్డుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్ లను అడ్డుకోవడంపై వివరాలు కోరిన హైకోర్టు..పాతబస్తీలో నిబంధనలు పాటించడం లేదని తెలిపింది. ఇవాళ 2.30కి లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ పై కెబినెట్ నిర్ణయం తెలియస్తామని ఏజీ సమాధానం ఇచ్చారు. ఏ రోజైతే హైకోర్టు ఆదేశాలు వస్తాయో.. ఆరోజు ప్రెస్ మీట్ లు పెట్టి లాక్ డౌన్ అవసరం లేదని సిఎస్ ఎలా చెప్తారని హైకోర్టు ప్రశ్నించింది. రంజాన్ అయిపోయిన తర్వాత లాక్ డౌన్ పెడదాము అనుకుంటున్నారా..? ఈలోగా కరోనా ఎంత వ్యాప్తి చెందుతుందో మీకు తెలుసా అని ప్రశ్నించింది హైకోర్టు.

Related posts