చరిత్రలో అద్భుతాలు
మానవుడి సాహసాలు
శ్రమలోని నిత్య సత్యాలు
కళ్ళముందు ఆవిష్కరణలు…
ఆదిమానవుడు నిప్పు సృష్టించే
అందమైన రుచిని ఆస్వాదించే
అడవి మృగాలను పారద్రోలే
ఆత్మరక్షణకు అగ్నిని ఆదరించే…
చక్రాన్ని కనుగొన్నాడు
చరిత్ర గతినే మార్చివేసే
అద్భుత కళాఖండాలను నిర్మించే
బ్రతుకు బండి తోడు కల్పించే..
అరక దున్నిన నేలను చదును చేసే
ఆహార పంటలు ఎన్నో పండించే
నేలమ్మ ను పంటతో సింగారించే
ప్రకృతి ఫలసాయాన్ని పొందే..
నివసించే గుహలు వదిలే
గూడు సుందరంగా అలంకరించే
ఆకులు అలమలు పక్కన పెట్టే
అందమైన వస్త్రాలను ధరించేను
అరుపులను శబ్దాలుగా మార్చే
శబ్దాలను మాటలుగా నేర్చే
మాటను భాషగా మలిచే
అక్షర జ్ఞానముతో ఉనికిని చాటే..
నీటిని బంధించెను
వ్యవసాయాన్ని పొడిగించేను
విద్యుత్ శక్తిని అందించెను
మనిషి నాగరికతనే మార్చే…
జంతువులపై ప్రయాణం నిషేధించే
గగనములో విహారం మొదలెట్టే
ప్రయాణ సాధనాలు కనిపెట్టే
ఆత్మ కంటే వేగముతో ప్రయాణించే..
నింగిని నేలను సముద్రాన్ని శోధించే
నూతన ప్రయోగాలు చేసే
నేలపై పెద్ద మనిషిగా నిలబడే
సృష్టిని ఆధీనంలో ఉంచుకునే..
ప్రాచీన మానవుడు ప్రసాదించిన
లోక జ్ఞానమే నేడు పుష్పించే
అలనాటి పునాదులపైనే
నేటి విజ్ఞాన దారుల్లో నడకలు…!!
నాగశౌర్యను మెగా హీరోలు తోక్కేస్తున్నారు… హీరోయిన్ వ్యాఖ్యలు