telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వరద బాధితులకు విరాళం ఇచ్చిన జిహెచ్ఎంసి కార్పొరేటర్లు..

ghmc hydeerabad

వరద బాధితుల సహాయార్థం ఒక నెల వేతనాన్ని “సిఎం రిలీఫ్ ఫండ్” కు విరాళంగా జిహెచ్ఎంసి కార్పొరేటర్లు ఇచ్చారు. ఈ చెక్కును కార్పొరేటర్లతో కలిసి రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కె తారక రామారావు కు మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్ అందజేశారు. జిహెచ్ఎంసి లో ఉన్న 150 మంది కార్పొరేటర్లలో మేయర్ కు రూ. 50,000 డిప్యూటీ మేయర్ కు రూ. 25000 లు నెల వేతనంగా పొందుతున్నారు. 148 కార్పొరేటర్లకు మ‌రియు 5 మంది కో-ఆప్ష‌న్ స‌భ్యుల‌కు ఒకొక్క‌రికి నెల‌కు రూ. 6వేల చొప్పున గౌవ‌ర వేతనం ల‌భిస్తుంది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లోని కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ౩౦ మంది వరదలకు మృతి చెందారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని  మేయ‌ర్‌, డిప్యూటి మేయ‌ర్, కార్పొరేట‌ర్లు, కో-ఆప్ష‌న్ స‌భ్యులు మొత్తం 155 మంది త‌మ‌కు నెల‌కు గౌర‌వ వేత‌నంగా ల‌భిస్తున్న మొత్తం రూ. 9,93,000/-ల‌‌ను ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి చెక్కు రూపంగా మంత్రి కె.టి.ఆర్‌కు అందించారు.

Related posts