telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

30 రోజుల ముందు పొత్తులపై నిర్ణయం: లోకేష్

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణాజిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు  నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు కేటాయిస్తామని లోకేశ్ చెప్పారు. పార్టీలో ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు పూర్తిగా తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ దొంగబ్బాయి అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో వైఎస్ఆర్ సీపీ ఓ డ్రామా కంపెనీగా అభివర్ణించారు. ఏపీలో వైఎస్ జగన్ నాలుగు డ్రామాలు ఆడారని గుర్తు చేశారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఒక డ్రామా అయితే కోడికత్తి మరో డ్రామా కంపెనీ అన్నారు. ఇక ఆవు అంబులెన్స్ అనేది మూడో డ్రామా అయితే ఎక్కడ లేని హామీలు ఇస్తూ మరో డ్రామాకు తెరలేపారంటూ మండిపడ్డారు తెలుగుదేశం పార్టీని వీడుతున్న వాళ్లంతా రాబోయే ఎన్నికల్లో టికెట్లు రాని వాళ్లేనని లోకేష్ పేర్కొన్నారు.

Related posts