సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ వస్తుందా? రాదా? ప్రశ్నకు తెర దిగిపోయింది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేసింది సెషన్స్ కోర్టు.. ఈ కేసులో ఏ-1గా ఉన్న అఖిలప్రియకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది.. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియ.. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో 17 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు.. గతంలో సికింద్రాబాద్ కోర్టు ఆమెకు బెయిల్‌ను నిరాకరించింది. ఇదే సమయంలో.. ఈ కేసులో దర్యాప్తు కోసం… పోలీస్ కస్టడీకి కూడా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక, ఇవాళ బెయిల్ మంజూరు కావడంతో… అఖిల ప్రియ రేపు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
రాఫెల్ స్కాంపై పక్కా ఆధారాలు.. మోదీ జైలుకు వెళ్లాల్సిందే: రాహుల్