telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ సెట్లో ఎన్టీఆర్‌, చరణ్‌…

ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కూడా తప్పకుండా ఉంటుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ప్రేక్షకుల్లో తెలియని ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. ఈ ఫీలింగ్‌ను ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు మరింత ఎక్కువ చేశాయి. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే నేడు ఈ సినిమాను మనం చూస్తుండేవాళ్లం. అలనాడు దర్శకుడు రాజమౌళి 2021 జనవరి 8న విడుదల చేయనున్నట్లు ఓ ప్రచార చిత్రం ద్వారా తెలిపారు. కాని కొన్ని అనివార్య కారణాల కారణంగా సినిమా ఆలస్యం అవుతోంది. ఈ సినిమాలో యంగ్‌టైగర్ ఎన్‌టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. వీరి పాత్రలను పరిచయం చేస్తూ విడుదలైన సినిమా టీజర్లు కూడా భారీ స్థాయి ఆదరణ పొందాయి. కొమరం భీమ్ ఏకంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13న ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఫొటోలను షేర్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌  క్లైమాక్స్ షూటింగ్ లోని చరణ్, ఎన్టీఆర్ ఫోటోలను షేర్ చేసింది చిత్రబృందం. ఫొటో క్యాప్షన్‌తో ఈ క్లైమాక్స్‌ కథ కూడా ముగింపుకు వస్తున్నట్లు తెలుస్తోంది

Related posts