రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు జగన్‌కు లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి, అరాచకానికి మధ్య జరిగే ఎన్నికలుగా అభివర్ణించారు. బాబాయ్ వివేకానందరెడ్డిని రెండు సార్లు కొట్టిన వార్తలు పత్రికల్లో చూసినట్లు గుర్తుచేశారు. రానురాను ఎన్నికల యుద్ధంలో వైసీపీ సరండరయ్యే పరిస్థితి వస్తుందని తెలిపారు.
వైసీపీకి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. ఆంధ్రా వ్యతిరేకులతో అంటకాగే పార్టీకి ప్రజలే బుద్దిచెప్పాలని కోరారు. పోలవరం పూర్తిచేసే టీడీపీ కావాలా.? కేసులు వేసే వైసీపీ కావాలా? అని అన్నారు. రాజధాని నిర్మించే టీడీపీ కావాలా, ఫ్యాక్షన్ రెచ్చగొట్టి ప్రాణాలు తీసే వైసీపీ కావాలో? ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.