telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

రంజాన్ స్పెషల్.. క్వారంటైన్ ముస్లింలకు నాన్ వెజ్!

chicken curry

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ నెల ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కరోనా బాధితులైన ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక భోజనం అందించనుంది. క్వారంటైన్లలో ఉండే ముస్లింలకు వారి ఇళ్లలో తయారయ్యే వంటకాల మాదిరే ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ రోజు నుంచే ఈ మెనూ అమల్లోకి రానుంది. క్వారంటైన్లలో ఉండే ముస్లింలు తెల్లవారుజామున ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. ఈ సమయంలో షెహరిగా రొట్టెలు, దాల్, వెజ్ కర్రీ అందించనున్నారు.

సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ విందులో చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, కిచిడీ, బగారా రైస్, దాల్చా అందిస్తారు. అల్పాహారంగా ఖర్జూరం పండ్లు, అరటి పండ్లు, ఇతర పండ్లను అందిస్తారు. రోజు విడిచి రోజు చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ అందిస్తారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్లిమేతరులను మరొక గదిలోకి తరలించనున్నట్టు సమాచారం. ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Related posts