telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ దేశ అధ్యక్షుడు రాజీనామా…!?

ఈ ఏడాది ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తోంది.  2020 ప్రారంభం నుంచి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. ప్రపంచంలో అందరికంటే తామే గొప్పవాళ్ళం అని చెప్పుకునే అమెరికా సైతం కరోనా దెబ్బకు కుదేలైంది.  కరోనా కంట్రోల్ చేయలేక నానా తంటాలు పడుతున్నది.  కరోనా వైరస్ కు మొదటగా తాము వ్యాక్సిన్ తయారు చేశామని చెప్పిన రష్యా, ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది.  బతికున్నంత కాలం అధ్యక్షుడిగా ఉండేలా రష్యా రాజ్యాంగాన్ని సవరించిన పుతిన్, ఇప్పుడు మరో షాక్ ఇవ్వబోతున్నాడు.  రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 

సోషల్ మీడియాలో పుతిన్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.  పుతిన్ అరుదైన పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని, ఆ వ్యాధి మొదటిదశలో ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారని, ఈ దశలో అధ్యక్షుడిగా కొనసాగడం కష్టమని వైద్యులు తెలిపినట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  2021 జనవరిలో పుతిన్ రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కథనాల ద్వారా తెలుస్తోంది.  68 ఏళ్ల పుతిన్ ఇప్పటికి నిత్యం రోజువారీ వ్యాయామం తప్పనిసరిగా చేస్తుంటారు.  గుర్రం స్వారీ తప్పనిసరి.  అయినప్పటికీ ఆయనకు అరుదైన పార్కిన్సన్ వ్యాధి ఎలా సోకింది అన్నది అర్ధంకాని విషయం.  పుతిన్ రాజీనామా చేస్తారనే వార్తలను రష్యా ప్రజలు నమ్మడం లేదు.  అధ్యక్షుడిగా పుతిన్ ఉంటారని వారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts