telugu navyamedia
తెలంగాణ వార్తలు

కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి ..నాలుగు ఓట్లు దండుకోవాల‌నుకుంటున్నారు..

ఖతెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మంలో పర్యటించారు. అక్క‌డ‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్.. రూ.11.75 కోట్లతో లకారం చెరువుపై నిర్మించిన కేబుల్‌ వంతెన, చెరువు వద్ద మ్యూజికల్‌ ఫౌంటైన్‌, రఘునాథపాలెంలో రూ.2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

2014లో తెలంగాణ రాకముందు ఖమ్మం పట్టణం ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ది మరో కార్పొరేషన్‌లో జరగడం లేదన్నారు . ఖమ్మం నగరాన్ని నంబర్‌ వన్‌గా మార్చాలనేదే మంత్రి పువ్వాడ అజయ్‌ లక్ష్యమని అన్నారు.

గ‌తంలో మురికి కూపంగా ఉన్న ల‌కారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశారు. ల‌కారం చెరువు వ‌ద్ద‌ తీగ‌ల వంతెనను ఏర్పాటు చేశాం. రోజుకు 2 వేల మంది అక్క‌డికి వ‌చ్చి ఆహ్లాదంగా గ‌డుపుతున్నారు. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో జ‌రుగుతున్న అభివృద్ధి మ‌రో కార్పొరేష‌న్‌లో జ‌ర‌గ‌డం లేదని అన్నారు.

మంచి పనులు జరిగేటప్పుడు, అభివృద్ధి, సంక్షేమం విషయంలో వేలెత్తి చూపించేందుకు వీల్లేకుండా పనులు చేస్తుంటే సహజంగానే కొంత మంది విమర్శలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుంటారు. అలాంటి ఒక కార్యక్రమాన్ని ఖమ్మంలో చేపట్టి ఒక నేతను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. అంతటితో ఆగకుండా బట్ట కాల్చి మీదేసినట్లు ఆ నేత చావుకు మంత్రి పువ్వాడను బాధ్యుడిని చేసేందుకు ప్రయత్నించారు

1987లో భార‌త‌దేశం ఆర్థిక ప‌రిస్థితి, చైనా ఆర్థిక ప‌రిస్థితి సేమ్. కానీ ఈ 35 ఏండ్ల త‌ర్వాత చూస్తే.. చైనా 16 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌తో ముందుకు దూసుకుపోయింది. మ‌నం మాత్రం 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌తో వెనుక‌బ‌డిపోయాం అని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద‌ల సంక్షేమం, దేశ పురోగతి, అభ్యున్న‌తి, ఎదిగిన దేశాల‌తోనే మా పోటీ అని చైనా ప్ర‌క‌టించి, అభివృద్ధిపై దృష్టి సారించింది. ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్‌గా చైనా ఎదిగింద‌న్నారు. మ‌న‌కేమో కుల పిచ్చి, మ‌త పిచ్చి ఎక్కువైపోయింది. దీంతో అభివృద్ధి అడుగంటి పోయిందన్నారు.

మ‌న దేశంలో ఏం జ‌రుగుతుందో యువ‌త ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ సూచించారు. శుక్రవారం ప్రార్థ‌న‌ల అనంత‌రం  ముస్లిలు దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఎందుకీ విప‌రీత ధోర‌ణులు క‌నిపిస్తున్నాయని ప్రశ్నించారు. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర మాట‌లు మాట్లాడుతున్న‌ది ఎవ‌రో ఆలోచించాలని అన్నారు

దేశంలో కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చ‌లి మంట‌ల‌ను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాల‌ని చూస్తున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగోడుతుందని మండిపడ్డారు. మతం చిచ్చుపెట్టి.. ఆ మంటల్లో చాలికాచుకుంటుందని విమర్శించారు. విద్వేషం తప్ప మరేదానిపై బీజేపీకి చిత్తశుద్ది లేదన్నారు. ఇతర మతాలపై విషయం చిమ్మే వ్యక్తులు రాజకీయ నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. దేశంలో ఎందుకు ఈ విపరీత ధోరణులు ఎందుకు కనిపిస్తున్నాయో ఆలోచన చేయాలన్నారు.

50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. ఎంపీ రేవంత్ రెడ్డి రెడ్లకు అధికారం ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారని, కులపిచ్చిగాళ్లు కావాలా?, అభివృద్ధి కోసం పాటుపడే టీఆర్ఎస్ కావాలా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కులం ఒక్కటే ఓట్లేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతారని అన్నారు. కొత్తగా ఆ పార్టీ చేసేదేమీ ఉండదన్నారు. 35 ఏళ్లలో చైనా ఆర్థిక శక్తిగా ఎదిగిందని.. కానీ భారతదేశంలో ఎందుకు జరగడం లేదో ఆలోచన చేయాలన్నారు.

Related posts