telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఉస్మానియా ఆస్పత్రిలో మైనర్‌ నిందితులకు వైద్య ప‌రీక్ష‌లు..

రాష్ర్ట‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన జూబ్లీహిల్స్‌ మైనర్ బాలికపై రేప్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు విచారణలో భాగంగా జువైనల్ హోం ఉన్న ఐదుగురు మైనర్లను కస్టడీలోకి తీసుకున్నారు.

ఇవాళ్టి నుంచి ఈ నెల 14వరకు విచారణ ప్రక్రియ కొనసాగనుంది. మైనర్ల విచారణకు జువైనల్ హోమ్​లో ఏర్పాట్లు చేయాలని పోలీసులు పర్యవేక్షకుడిని కోరారు. అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేయలేమని పర్యవేక్షకుడు తెలపడంతో…. పోలీసుస్టేషన్​లోనే విచారించాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు.

ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ప్రశ్నించనున్నారు. సాయంత్రం 5 తర్వాత మైనర్లను తిరిగి జువైనల్ హోమ్​లో అప్పగించనున్నారు

మ‌రోవైపు.. మైనర్ నిందితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో వైద్య బృందం సాదిద్దున్ మాలిక్ తో పాటు ఐదుగురు మైనర్ నిందుతులకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

భారీ పోలీస్ బందోబస్తు మధ్య మూడు ప్రయివేట్ కార్లలో నిందితుల్ని ఉస్మానియ కు పోలీసులు. త‌ర‌లించారు. ముఖాలకు మాస్కులు వేసి ఒక్కోకరిని ఫోరెన్సిక్ విభాగంలోకి త‌లిరించారు.

ఈ వైద్య పరీక్షకు సుమారు రెండు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం ఆరుగురు నిందితులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు త‌ర‌లించ‌నున్నారు.

Related posts