telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

శ్రీమతి వందితరావు & మిస్టర్ ఇ రామ్మోహన్ రావులకు 30వ యుధ్వీర్ స్మారక అవార్డును అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక, ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి. హరీష్ రావు

రూరల్ డెవప్మెంట్ ఫౌండేషన్ (RDF) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో  విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీమతి వందిత రావు, శ్రీ రామ్మోహన్ రావులకు 30 వ యుద్దవీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డు ప్రదానం చేసిన మంత్రి హరీశ్ రావు

మంత్రి కామెంట్స్…..
చేయడం సంతోషంగా ఉంది. మీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
తమ పూర్వీకులు ఇంటినే పాఠశాలగా మార్చి విద్యను అందిస్తే, శ్రీమతి వందిత రావు, శ్రీ రామ్మోహన్ రావు గార్లు RDF ఫౌండేషన్ ద్వారా విద్యను అందిస్తూ, సమానత్వం కోసం కృషి చేస్తున్నారు.

25 శాతం సంపాదన పేదల విద్య కోసం ఖర్చు చేస్తున్నారు. విద్యను పంచుతున్నారు.

మీ నుండి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు. మంచి కార్యక్రమాలు చేస్తారు.

సమాజంలో ఎక్కువ మంది మంచి వాళ్లే. చెడ్డ వాళ్లే తక్కువ. ఎంతో మంది సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.

అలాంటి వారికి సత్కారం చేయడం మంచి విషయం.

ఈరోజు చారిత్రక ఘట్టం. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం చేసుకున్నాం.

తెలంగాణలో సీఎం కేసీఆర్ గారు అమలు చేస్తున్న పథకాలు పత్రికల ద్వారా ప్రజలకు తెలియ చేయాలి.

ఆరోగ్య రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మేము సంతోష పడక, మొదటి స్థానం కోసం కృషి చేస్తున్నాం.

మంచి ఎక్కడ ఉన్నా మేము నేర్చుకొని అమలు చేస్తాం.

Related posts