టీం ఇండియా గురించి భారత హెడ్ కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతూ… 23 ఏళ్లలోపే రిషబ్ పంత్ నాలాగే విదేశాల్లో విజయవంతం అయ్యాడు. ఇటీవల పంత్ చాలా బరువు పెరిగాడు. జిమ్‌లో శ్రమించి బాగా తగ్గాడు. ఆఫ్‌సైడ్ ఆటలోనూ మార్పులు చేసుకున్నాడు. ఇప్పుడు అందరూ చూస్తోంది శ్రమ ఆ ఫలితాలే. తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడితే పంత్ తిరుగులేని మ్యాచ్ విన్నర్. ఆఫ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ జట్టుకు కొత్త ఆటగాడేం కాదు. చాలా ఏళ్లుగా జట్టుతోనే ఉంటూ వస్తున్నాడు. కానీ గాయాలు కావడంతో దురదృష్టం కొద్దీ జట్టుకు దూరమయ్యాడు. అందుకే జడేజా, కృనాల్‌లకు అవకాశాలొచ్చాయి. ఇప్పుడు గాయాల నుంచి కోలుకున్నాక దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. జడేజా లేని లోటుని అతను తెలియనీయలేదు. అశ్విన్, జడేజా, అక్షర్ కలిసి ఆడితే చూడాలని ఉంది’ అని శాస్త్రి తన మనసులో మాట చెప్పాడు.
previous post