telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు వ్యాపార వార్తలు

భారీగా పడిపోయిన టమాటా ధర..రైతుల ఆందోళన

tamato market

రెండు నెలల క్రితం రిటైల్‌ మార్కెట్‌లో కిలో టొమాటో రూ.70-రూ.80 పలికిన టమాటా ధర ఇప్పుడు దారుణంగా పతనమైంది. దిగుబడులు ఒక్కసారిగా పెరగడంతో దీంతో ఒక్కసారిగా టొమాటో ధరలు భారీగా పడిపోయాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్టణం జిల్లా కృష్ణదేవిపేట మార్కెట్‌లో నిన్న కిలో టమాటాలను రూపాయికి కూడా కొనేవారు లేకపోయారు. పరిసర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు పోటెత్తిన టమాటాలను కొనేవారు లేక రైతులు సాయంత్రం వరకు ఎదురుచూశారు.

30 కిలోల (క్రేటు) టమాటాలను రూ.30కి కూడా కొనేవారు లేకపోవడంతో రైతులు నిరాశ చెందారు. చివరికి పోగులుగా పోసి విక్రయించాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను చూసి సంబరపడ్డామని, కానీ ఇలా జరుగుతుందని మాత్రం ఊహించలేకపోయామని వాపోయారు. ధరలు పడిపోవడంతో తమకు కనీసం రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts