telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏలూరు పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ వ‌ద్ద ఉద్రిక్త‌త‌..

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త‌త‌ వాతావరణం కొనసాగుతోంది.

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.  గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకొన్నాయన్నారు

గ్రామస్తులు ఫ్యాక్టరీ వద్ద చెట్లు, దుంగలను అక్కిరెడ్డిగూడెం రోడ్డుకు అడ్డంగా వేశారు. ఈ ఫ్యాక్టరీని వెంటనే ఇక్కడి నుంచి తీసివేయాలి అని నినాదాలు చేశారు

ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఆందోళన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు… ఫ్యాక్టరీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

కాగా. బుధ‌వారం రాత్రి పోరస్ రసాయన పరిశ్రమలోని భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో నైట్ షిప్ట్ లో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు సజీవదహనం అయ్యారు. మరొకరు హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతిచెందాడు. ఇక మరో 13 మంది కార్మికులు తీవ్రంగా కాలిన గాయాలతో నూజివీడులోని ఏరియా ఆసుపత్రి కొందరు, విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మరికొందరు చికిత్స పొందుతున్నారు.

వీరిలోనూ ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలైన 13 మందిలో ఏడుగురు బీహార్ కు చెందిన వారు కాగా ఆరుగురు స్థానికులు వున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న పోలీస్, రెవెన్యూ, ఫైర్ అధికారులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు/

 

Related posts