telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ కరోనా అప్డేట్…

Corona

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..  తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1114 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 616688 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1280 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,96628 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3598 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 16,492 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,18,109 మందికి కరోనా పరీక్షలు చేయడంతో.. ఇప్పటివరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,78,88,192 కు చేరింది.

Related posts