telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు: బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత

న్యూఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టుల్లో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిస్రా చేసిన ఆరోపణలపై కవిత సీరియస్ అయ్యారు.ఈ స్కాంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. 

తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని కూడా కవిత చెప్పారు.అయితే సీఎం కేసీఆర్‌ ను బీజేపీ టార్గెట్ చేసిందని, జాతీయ స్థాయిలో రాజకీయాల్లోకి వెళుతున్న నేపథ్యంలో ఫోకస్ పెట్టిందని ఆమె అన్నారు. కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టాడానికి.. ఆయన కుమార్తనైన తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కవిత విమర్శించారు.

దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటానన్నారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని కవిత అన్నారు . తనపై తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కూడా కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమె ఈ ఇద్దరు నేతలపై పరువు నష్టం దావా వేసింది.

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన 29 మంది బీజేపీ నేతలను సీసీ ఫుటేజీ, వీడియోల ద్వారా గుర్తించినట్లు బంజారాహిల్స్ సీఐ నరేందర్ తెలిపారు. వీళ్లందరిపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 26 మందిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. నిందితులపై 341, 147, 148, 353,332, 509, రెడ్ విత్ 149 కింద కేసులు నమోదు చేసినట్ల సీఐ వివరించారు.

Related posts