telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతాంగానికి ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Congress Jeevan Reddy Contest MLC

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతాంగానికి ఏక కాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పిస్తే రాష్ట్రానికి ఆర్థికంగా లక్ష కోట్ల ప్రయోజనం చేకూరేదన్నారు.కనీసం పసుపు, ఎర్రజొన్న, మిర్చికి మద్దతు ధర కల్పించలేకపోయారంటూ విమర్శలు గుప్పించారు. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైతే పసుపు, మిర్చికి మద్దతు ధర కల్పిస్తామన్నారు. లక్షా యాభైవేల ఆదాయం ఉన్న కుటుంబానికి రూ.6వేలు ఇస్తామన్నారు.

టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లుగా 16 ఎంపీ స్థానాల్లో ఆ పార్టీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు 16 మంది ఎంపీలు ఉన్నారని, ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. లౌకిక వాదానికి కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే త్రిబుల్ తలాక్‌ను రద్దు చేస్తామన్నరు. బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని జీవన్ రెడ్డి ఆరోపించారు.

Related posts