కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి… జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తామని వ్యాఖ్యానించారు. సాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన.. జానారెడ్డి పెద్ద కొడుకుగా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్న ఆయన.. గిరిజన రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే కేసీఆర్ హాలియాలో మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు.. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డ రేవంత్ రెడ్డి.. ఉద్యోగం రాక సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు.. సునీల్ నాయక్ ఆత్మ శాంతించాలంటే టీఆర్ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
నాకు సంక్షోభాలు కొత్తకాదు..నేను పోరాటం కొనసాగిస్తా: చంద్రబాబు