telugu navyamedia
రాజకీయ వార్తలు

సుప్రీంలో చిదంబరంకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు

congress chidambaram

సుప్రీంలో చిదంబరంకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. సీబీఐ అరెస్ట్ లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. కింది కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే సీబీఐ కస్టడీలో చిదంబరం ఉన్నారని, ఇప్పుడు బెయిల్ పిటిషన్ ను విచారించడం అనవసరమని తెలిపింది.

ఢిల్లీ హైకోర్టు చిదంబరంకు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తరపున న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్విలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు నేటితో  చిదంబరంకు సీబీఐ కస్టడీ ముగియనుంది. 

Related posts