telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

నిజామాబాద్‌లో కవిత వెనుకంజ

MP Kavitha comments BBP Govt.

తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో  వూహించని  ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ   తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత వెనుకంజలో కొనసాగుతుండటం గమనార్హం. ఆమె పై పోటీకి దిగిన  బీజేపీ  అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ ముందంజలో కొనసాగుతున్నారు.  తొలి రౌండ్‌ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి అరవింద్‌ 18వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడి నుంచి 160 మందికిపైగా రైతులు పోటీకి దిగిన సంగతి తెలిసిందే. 

కాగా మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ 4302 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో బీజేపీ 6483 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్‌లో బీజేపీ 31,000ఓట్ల ఆధిక్యంలో ఉంది. కరీంనగర్‌లో బీజేపీ 28,031 ఓట్ల ఆధిక్యంలోనూ నల్గొండలో కాంగ్రెస్‌ 7157 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. భువనగిరిలో టీఆర్‌ఎస్ 3304 ఓట్ల ఆధిక్యంలోనూ, చేవెళ్లలో కాంగ్రెస్‌ 1876 ఓట్ల ఆధిక్యంలోనూ, జహీరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ 22,032 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Related posts