telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో 1,000 దాటిన కరోనా కేసులు!

Corona

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,000 దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 61 మందికి కరోనా నిర్ధారణ కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,016కి చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కలిపి 61,266 కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 8,141 పరీక్షలు నిర్వహించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1,806 టెస్టులు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

Related posts