telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది….

amaravati farmers protest on 15th day

ఏపీలో మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చిన ఆరోజున తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి తదితర గ్రామాల్లో రైతులు రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.  అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని చెప్పి ఆరోజు నుంచి రైతులు ఉద్యమం చేయడం మొదలుపెట్టారు.  రాజధాని అమరావతి కోసం ఉద్యమం మొదలుపెట్టి నేటికీ ఏడాది పూర్తయింది.  ఈ సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ సభకు 30 వేలమందికి పైగా రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నది.  అమరావతికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.  అటు బీజేపీ కూడా అమరావతికి జైకొట్టింది.  జనసేన పార్టీ కూడా మద్దతు ఇస్తోంది.  కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా అమరావతికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.  అమరావతి సాధన కోసం రైతులు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు అన్నది ఈరోజు ఈ సభ ద్వారా తెలియజేసే అవకాశం ఉన్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts