ఏపీపీఎస్‌సీ, పంచాయతీరాజ్ సబార్డినేట్ సేవలలో 1051 పంచాయతీ కార్యదర్శి (గ్రూప్-3) పోస్టుల భర్తీకి ఈ ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తోంది. దీనికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పోస్టులకు 4,95,526 దరఖాస్తులొచ్చాయి. అంటే ఒక్కో పోస్టుకు 471 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆఫ్‌లైన్‌లో.. ఆబ్జెక్టివ్ టైపులో 150 మార్కులకు జరిగే పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి.
నెగెటివ్ మార్కుల విధానం అమలు చేస్తున్నందున ప్రతి తప్పు జవాబుకు మార్కులో మూడో వంతు కట్ అవుతుంది. జిల్లాల వారీగా శ్రీకాకుళం 114, విజయనగరం 120, విశాఖపట్నం 107, తూర్పుగోదావరి 104, పశ్చిమగోదావరి 25, కృష్ణా 22, గుంటూరు 50, ప్రకాశం 172 , నెల్లూరు 63, చిత్తూరు 141, అనంతపురం 41 , కర్నూలు 90, కడప 2 పోస్టులున్నాయి.