హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రేపు అభ్యర్థిని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. నల్లగొండ జిల్లాతో టీడీపీకి అవినాభావ సంబంధం ఉందన్నారు.
తెలంగాణలో టీడీపీకి పునర్ వైభవం తేవాలంటే హుజూర్‌నగర్‌లో పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. తమ అభ్యర్థి సోమవారం నామినేషన్ వేస్తారని తెలిపారు.