telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్రేమికుల రోజున ‘లవ్ స్టోరీ’ నుండి కొత్త పాట…

అక్కినేని హీరో నాగచైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథగా రూపొందింది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాట ప్రోమోలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అనుకున్న స్థాయికంటే ఎక్కువగానే ఆకర్షించాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, హే పిల్లా పాటతో ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14న) ఉదయం 10.08 లకు ‘నీ చిత్రం చూసి’ పర్ఫెక్ట్ ట్రాక్ తో రాబోతున్నట్లుగా నాగచైతన్య పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు. ఏప్రిల్ 16న థియేటర్లోకి రానుంది. ఈ సినిమాను ఓవర్‌సీస్ హక్కులను ఆరున్నర కోట్లకు విక్రయించారు. దాంతో అక్కడ కూడా మార్కెట్ పూర్తి స్థాయిలో తెరుచుకునేంతవరకు సినిమా విడుదల కాదని భావించారు. చూడాలి మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది చూడాలి.

Related posts