telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను స్వాగతిస్తాం: గంటా

Ganta srinivas tdp

ఏపీకి మూడు రాజధానుల అంశంపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి స్పందించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను స్వాగతించకుండా ఉండలేమని స్పష్టం చేశారు. విశాఖా నగరం ఇప్పటికే ఆర్థిక రాజధానిగా ఎదిగిందని అన్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే మరిన్ని వనరులు లభిస్తాయన్నారు.

అమరావతి నుంచి రాజధానిని తరలించిన తర్వాత అక్కడి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదేనని గంటా పేర్కొన్నారు.విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా చేయడాన్ని సమర్థిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు చెప్పారు. అనంతరం దానిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి పంపినట్టు చెప్పారు.

Related posts