telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో ఆడటానికి ఆటగాళ్లకు అనుమతి ఇచ్చిన ఆసీస్…?

IPL

అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమైంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌పై బీసీసీఐ త్వరలోనే అధికారిక ముద్ర వేయనుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు త్వరలో చేపట్టనుంది. అర్ధాంతరంగా ఐపీఎల్ 2021 వాయిదా పడటం వల్ల విదేశీ క్రికెటర్లు ఆడతారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. అయితే ఐపీఎల్ టోర్నమెంట్‌లో గ్లామరస్‌గా మార్చడంలో విదేశీ ప్లేయర్ల పాత్రే అధికం. ఆసీస్, కివీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్ల బ్యాటింగ్.. బౌలింగ్..ఫీల్డింగ్ స్టంట్స్ ఈ మ్యాచ్‌లను అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మార్చివేశాయి. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఇప్పటికే ఐపీఎల్ ఫేస్ 2కు దూరం అయ్యారు. ఆ లోటును ఆస్ట్రేలియా తీర్చే అవకాశాలు దాదాపు ఖాయమైనట్టే. ఐపీఎల్ ఫేస్ 2 షెడ్యూల్ సమయంలో ఆస్ట్రేలియా శ్రీలంక షెడ్యూల్‌ను పెట్టుకుంది. శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఆసీస్‌తో మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20ల్లో తలపడుతుంది. ఈ సిరీస్‌కు ఎంపిక కాలేని ఆటగాళ్లు ఐపీఎల్ 2021లో ఆడటానికి క్రికెట్ ఆస్ట్రేలియా దాదాపు అనుమతి ఇచ్చినట్టేనని తెలుస్తోంది. సౌతాఫ్రికన్ క్రికెటర్లందరూ దాదాపు ఓకేనే. ఐపీఎల్‌లో ఆడటానికి రెడీగా ఉన్నారు.

Related posts