telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

దసరాకి .. రైల్వే బోనస్.. మూడింతల టికెట్…

3x times platform ticket on dussehra

దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధర ఏకంగా మూడింతలు పెంచారు. ప్రస్తుతం ప్లాట్ ఫామ్ టికెట్ రేటు రూ.10. దీన్ని రూ.30కు పెంచారు. పెంచిన ధరలు విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో అమలవుతాయి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ 11 నుంచి మళ్లీ పాత రేట్లు అమల్లోకి వస్తాయి. దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండుగల సమయంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తమవారికి వీడ్కోలు చెప్పడానికి, వచ్చిన వారిని రిసీవ్ చేసుకోవడానికి బంధువులు, స్నేహితులు రైల్వే స్టేషన్లకు వస్తుంటారు. ఇలా వచ్చే వారితో స్టేషన్ ప్లాట్ ఫామ్ బాగా రద్దీగా మారి ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ప్లాట్ ఫామ్‌పై రద్దీని తగ్గించడానికి టికెట్ రేటు పెంచుతారు.

పండుగల సమయాల్లో రద్దీని నియంత్రించేందుకు రైల్వే శాఖ ప్రతి ఏడాది ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరను పెంచడం కామన్. ఇలా పెంచడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి రద్దీ తగ్గుతుంది.. ఆదాయం కూడా బాగా వస్తుంది. ప్రతి ఏడాది ఇలా ఒక వారం రోజులపాటు టికెట్ ధరలు పెంచడం సహజమే. కానీ, ఈసారి ఏకంగా 3 రెట్లు పెంచడం షాక్ కు గురి చేసింది. గతంలో రూ.10 ఉండే టిక్కెట్ ధరను రూ.20గా చేసేవారు. కానీ ఈసారి ఏకంగా 30 రూపాయలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

Related posts