భారతజట్టు సారథి విరాట్ కోహ్లీని బంగ్లాదేశ్‌తో డే-నైట్ టెస్టుకు ఒప్పించేందుకు కేవలం 3 సెకన్ల సమయం పట్టిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. గతేడాది ఆస్ట్రేలియాతో గులాబి టెస్టుకు ఎందుకు అంగీకరించలేదో తెలియదని పేర్కొన్నారు. ఖాళీ స్టాండ్ల మధ్యన ఆడుతూ టెస్టు క్రికెట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లగలమని దాదా ప్రశ్నించాడు. అడిలైడ్‌లో డే-నైట్ టెస్టు ఆడేందుకు ఎందుకు ఒప్పుకోలేదో నిజంగా నాకు తెలియదు. కోహ్లీతో గంటపాటు సమావేశం అయ్యాను. తొలి ప్రశ్న డే-నైట్ టెస్టు గురించే అడిగాను. ముందుకు వెళ్దామని 3 సెకన్లలో సమాధానం ఇచ్చాడు. గతంలో ఏం జరిగిందో, కారణమేంటో నాకు తెలియదు. డే-నైట్ టెస్టులపై అతడు ఇష్టంతో ఉండటం గమనించాను. ఖాళీ స్టాండ్లతో టెస్టు క్రికెట్ ముందుకు తీసుకెళ్లలేమని విరాట్ గ్రహించాడని దాదా అన్నాడు.
టీ20 మ్యాచ్‌కు ప్రతి స్టాండ్ కిక్కిరిసిపోతుందని నాకు తెలుసు. అలాగే సరైన పద్ధతిలో వ్యవహరిస్తే టెస్టు క్రికెట్‌కు జనాలను తీసుకురావొచ్చు. భారత్‌కు ఇది ఆరంభం. డే-నైట్ విధానంతో టెస్టు క్రికెట్ జవసత్వాలు పొందుతుంది. ఇప్పుడు ప్రజల జీవితాలు మారాయి. కార్యాలయాలను వదిలేసి రాలేరు. వారికి తగ్గట్టు మనమే మార్పులు చేసుకోవాలి. ఎన్నోసార్లు మార్పు మంచిదే అవుతుంది. నమ్మినవే నిజమవుతాయి. కంఫర్ట్ జోన్‌ను వదిలేస్తే మార్పు మొదలవుతుంది. గులాబి బంతి తిరిగి జనాలను ఆకర్షిస్తుందనే అనుకుంటున్నా. నా వందో టెస్టు బాక్సిండ్ డే నాడు మెల్‌బోర్న్‌లో ఆడాను. కెరీర్‌లో అలాంటి స్థితిలో ఉండాలంటే అదృష్టం ఉండాలి. ఆ టెస్టు మ్యాచ్ తొలిరోజు దాదాపు 70వేల మందితో స్టాండ్లు నిండిపోయాయి. యాషెస్‌లోనూ అంతేనని గంగూలీ వెల్లడించాడు.
అమితాబ్ తో సమానంగా నటించాను… అయినా… : తాప్సి