telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంప్ లు ఎంతగానో దోహదపడుతున్నాయి

ఆధునిక, సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారుల్లో నైపుణ్యతను మరింత పెంపొందించే దిశగా జిహెచ్ఎంసి సమ్మర్ క్యాంప్ లను ప్రతి యేడాది నిర్వహించడం జరుగుతుంది. ఈ  ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. వేసవి శిక్షణ శిబిరం సందర్భంగా 44 క్రీడల లో ప్రాచుర్యం పొందిన ఆధునిక క్రీడా లాంగ్ టెన్నిస్ పోటీలు నగర వ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాలలో నిర్వహించడం జరిగింది.

ఈ నేపథ్యంలో లాంగ్ టెన్నిస్ క్రీడా పై విశేష స్పందన వచ్చింది. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని లాంగ్ టెన్నిస్ ఆట ను ఆస్వాదిస్తున్నారు. ప్రత్యేక సమ్మర్ కోచింగ్ క్యాంప్ లు నగర వ్యాప్తంగా ఉన్న 353 క్రీడా మైదానాలు గల 915 ప్రదేశాలలో వివిధ  క్రీడలు, ఆటల పోటీలలో 6 సంవత్సరాల వయస్సు నుండి 16  సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు పాల్గొని  క్రమశిక్షణ అలవర్చుకుంటూ క్రీడా స్ఫూర్తి కొనసాగిస్తున్నారు. చందానగర్ పీజేఆర్ స్టేడియం, కె.పి.హెచ్.బి కాలనీ, కూకట్ పల్లి వసంత నగర్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి టీచర్స్ కాలనీ లోని టెన్నిస్ కోర్టులో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని శిక్షణ పొందుతున్నారు.

సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో భాగంగా గురువారం ఎల్బీనగర్ జోన్ లోని ఉప్పల్ జిహెచ్ఎంసి ప్లే గ్రౌండ్ లో ఇంటర్ ఎస్.ఎస్.సి సెంటర్స్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో క్రికెట్, క్యారమ్స్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు.

Related posts