telugu navyamedia
తెలంగాణ వార్తలు

మునుగోడులో వాటిపైన చర్చ జరగాలి కానీ ..వ్యక్తిగత దూషణలపై దృష్టి మళ్లుతోంది

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక వేళ సమస్యల ప్రతిపాదికన జరగాల్సిన చర్చ కాస్తా.. వ్యక్తిగతమైన విమర్శలు, పరుష పదజాలం వైపు చర్చ జరుగుతుందన్నారు. దీనివల్ల తెలంగాణ సమాజానికి, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ‌ ప్రజలకు నష్టం జరుగుతుందని అన్నారు.

మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, పెరిగిన నిత్యావసర ధరలపై చర్చ జరగాలని అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.

8 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయాల వల్ల.. పేదలపై పడిన భారం గురించి చర్చ జరగాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై భారం వేసి.. బతకడమే కష్టంగా మార్చిందని విమర్శించారు.

 ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ పాలనలో పేదలు, నిరుద్యోగులు, రైతులు.. చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఓట్లు అడగాలంటే.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పరిష్కరించడానికి వారి ప్రణాళికలను చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గానికి కేంద్రంలోని బీజేపీ రూ. 5 వేల కోట్లు ప్రకటించి.. అక్కడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ పని చేసి బీజేపీ ఓట్లు అడిగితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు

కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై పోరాటం చేయాలని.. బీజేపీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు రేవంత్‌ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు .బీజేపీ, టీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదని ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదలు బ్రతకలేని పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో పేదలు, రైతులు, యువకులు మోసపోయారని తెలిపారు.సీఎం కేసీఆర్ చెప్పిందే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Related posts