telugu navyamedia
ఆంధ్ర వార్తలు

క‌ర్నూలులో గోరంట్ల మాద‌వ్‌కు ఘ‌న స్వాగ‌తం..

కర్నూల్ లో గోరంట్ల మాధవ్ కు కురుబ సంఘం నేతలు ఘనంగా స్వాగతం పలికారు. టోల్ ప్లాజా నుంచి బళ్లారి చౌరస్తా వరకు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.

ఇటీవ‌ల‌ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్‌ మీడియా లో వైర‌ల్ అయ్యింది . మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డారు.

పార్లమెంట్ సమావేశాలు జరుగున్న సమయంలోనే ఈ వీడియో వైరల్ అయింది. ఈ దూమారానికి తాత్కాలికంగా తెర పడిన తర్వాత ఆయన హిందూపురానికి వస్తున్న‌ మాధవ్‌కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ .. తనను గెలిపించిన ప్రజలలో అప్రతిష్ట పాలు చేసేందుకు చులకన చేసేందుకు ప్రయత్నించాలని చూస్తే ప్రతి చర్య తప్పదని హెచ్చరించారు. చేయని తప్పుకు ఫేక్ వీడియో సృష్టించి నిజమైన వీడియో గా క్రియేట్ చేస్తూ నన్ను.. నా పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే భంగపాటు తప్పదని హెచ్చరించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు నోటు ఆడియోను అమెరికా ల్యాబ్‌లో పరీక్ష చేయించాలని ఆయన కోరారు ఒరిజినల్ వీడియో తన వద్ద ఉందని పోలీసులు అడిగితే ఈ వీడియోను ఇస్తానని గోరంట్ల మాధవ్ చెప్పారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ వీడియో అని అమెరికాలో ల్యాబ్ తేల్చినట్టుగా టీడీపీ నేతలు చెప్పడం దుర్మార్గమన్నారు. 

టీడీపీ నేతలు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాటల ఆడియోను అదే అమెరికా ల్యాబ్ కు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఒరిజినల్ వీడియో తన వద్ద ఉందని పోలీసులు అడిగితే ఈ వీడియోను ఇస్తానని గోరంట్ల మాధవ్ చెప్పారు.

టీడీపీ  నేతలే కాకి డ్రెస్ వేసుకున్న పోలీసుల్లా, జడ్జిల్లా, సైంటిస్టుల్లా, ఇతర అధికారుల్లా తీర్పులు..  ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తాను పోలీసు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదని ..  కులాల మధ్య చిచ్చు పెట్టలేదన్నారు గోరంట్ల మాధవ్.

పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. బీసీలను అనగదొక్కేందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ విమర్శించారు.

Related posts