telugu navyamedia
సినిమా వార్తలు

ఫ్యామిలీతో కలిసి బింబిసారను వీక్షించిన బాలయ్య..

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ సినిమాలో క్యాథరీన్‌, సంయుక్తా మీనన్‌ హీరోయిన్లుగా నటించారు.

ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ను అధిగమించి భారీ లాభాల దిశగా పయనిస్తోంది.

Image

ఇక ఈ సినిమాలో రెండు వైవిధ్యమైన కనిపించాడు కల్యాణ్‌రామ్‌. అతని నటనకు థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి. ఇలా సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళ్లుతోంది.

Image

తాజాగా బింబిసార సినిమాను నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. బాల‌కృష్ణ‌తో పాటు హీరో కల్యాణ్‌రామ్, క‌ళ్యాణ్‌రామ్ సోద‌రి సుహాసిని, భార్య స్వాతి తో పాటు మూవీ డైరెక్టర్‌ వశిష్ఠ వారితో ఉన్నారు.

ఈ సందర్భంగా బింబిసార చిత్రబృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కల్యాణ్‌రామ్‌ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Related posts