telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రోజుకో ఛాలెంజ్ : .. బాటిల్ ఛాలెంజ్ అంటున్న అక్షయ్.. మీరు ట్రై చేయొచ్చు..

akshai introduced bottle challenge

సామజిక మాధ్యమాల పుణ్యమా అంటూ ప్రతిరోజూ ఏదో ఒక కొత్త ఛాలెంజ్ లు చూస్తూనే ఉన్నాం. తాజాగా, ‘బాటిల్ క్యాప్’ పేరిట మరో ఛాలెంజ్ బయటకొచ్చింది. హాలీవుడ్ స్టార్ జసోన్ స్టాతమ్ ఇచ్చిన బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ను సింగర్ జాన్ మయార్ స్వీకరించడంతో ఈ ఛాలెంజ్ వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ హాలీవుడ్ నుండి బాలీవుడ్ కు..అక్కడి నుండి సామాన్య ప్రజల్లోకి వెళ్ళింది.

ఇందులో చేయాల్సింది ఏమంటే .. ఒక బాటిల్ క్యాప్ ను సగం తీసి ఉంచుతారు. మిగిలిన సగంను కాలితో తన్ని తీయాల్సి ఉంటుంది. కాలితో తన్నిన సమయంలో బాటిల్ ఏమాత్రం కదలకుండా జాగ్రత్త పడాలి. బాటిల్ కదలకుండా మూత తీస్తే ఛాలెంజ్ పూర్తీ అయినట్లే. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ఛాలెంజ్ తెగ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మరియు ఇంకా పలువురు స్టార్స్ కూడా ఈ చాలెంజ్ ను స్వీకరించడంతో అందరు దీనిని ట్రై చేస్తున్నారు.

Related posts