బద్రి, నాని సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది హీరోయిన్ అమీషా పటేల్. బాలీవుడ్ లో మంచి అవకాశాలను అందుకుని, వరుస ఆఫర్స్ తో ఒక రేంజ్ ని మెయింటైన్ చేసింది. కానీ గ్లామర్ ప్రపంచంలో కుర్ర హీరోయిన్స్ పోటీ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ కాలం నిలవలేకపోయింది. అమీషా వయసు ఇప్పుడు 42 సంవత్సరాలు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. అప్పుడపుడు స్పెషల్ సాంగ్స్ లలో కనిపిస్తున్న అమీషా ఈ వయసులో కూడా గ్లామర్ తో యూత్ ను అట్రాక్ట్ చేస్తూ మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో బిజీగా ఉన్న అమీషా కుదిరితే టాలీవుడ్ లో కూడా మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
previous post