telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ బూతు డైలాగ్ ను తొలగించొద్దు… వేడుకుంటున్న హీరోయిన్

Priyanka

నందు, ప్రియాంక శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘సవారి’. సాహిత్ మోత్కూరి సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రియాంక శర్మ కథానాయికగా నటించారు. అయితే ఈ సినిమాలో ఓ బూతు పదం వాడుతూ ప్రియాంక చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ డైలాగ్ చెప్పింది. ‘ఓ గాడ్. ఐ డోన్ట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఫకింగ్ వరల్డ్’ అనేది డైలాగ్. అయితే ఈ సినిమాకు ఇంకా సెన్సా్ర్ సర్టిఫికేట్ రాలేదు. ఒకవేళ సినిమా సెన్సార్‌కు వెళ్తే డైలాగ్‌లోని ‘ఫక్’ అనే పదం తీసేస్తారేమోనని ప్రియాంక భయపడుతున్నారు. ‘‘ఈ సినిమాలో ఇదే నా ఫేవరేట్ డైలాగ్. దేవుడా దయచేసి ఈ డైలాగ్‌ను సెన్సార్ బోర్డు వాళ్లు తీసేయకుండా చూడు’ అని వేడుకుంటున్నారు. ఈ సినిమా మొత్తం నందు, గుర్రం చుట్టూ తిరుగుతుందట. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts