telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

ఇదే తెలంగాణ.. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ .. రేపటి నుండే పాఠశాలలు ..

huge job notification in telanganaf

నేడు రాష్ట్ర విద్యాశాఖ 2019-20 విద్యా సంవత్సరానికిగాను అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 2019-20 విద్యా సంవత్సరంలో మొత్తం 232 రోజులు స్కూళ్లు పనిచేయనున్నాయి.

ఈ విద్యాసంవత్సర క్యాలెండర్‌ వివరాలు :

* పదో తరగతి విద్యార్థులకు జనవరి 10వ తేదీవరకు సిలబస్‌ పూర్తి
* ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఫిబ్రవరి 29 నాటికి సిలబస్‌ పూర్తి
* సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 13 వరకు దసరా సెలవులు (16 రోజులు)
* అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 26 వరకు ఎస్‌ఏ 1 పరీక్షలు
* మిషనరీ స్కూళ్లకు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు క్రిస్మస్‌ సెలవులు (7 రోజులు)
* జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు (6 రోజులు)
* ఫిబ్రవరి 29 నాటికి పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు పూర్తి
* ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఎస్‌ఏ 2 పరీక్షలు
* ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11వరకు పాఠశాలలకు వేసవి సెలవులు

Related posts