telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రణబీర్ కపూర్ డూప్ ఆకస్మిక మృతి … గుండెపోటుతో 28 ఏళ్లకే…!

Junaid

మనుషులని పోలిన మనుషులు ఏడుగురు ఏడు ఖండాల్లో ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. అలాే బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కి జీరాక్స్‌లా ఉన్న ఓ వ్యక్తి ఆ మధ్య వార్తలలో నిలిచాడు. రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్‌ సైతం కొడుకును పోలిన వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. మోడల్‌గా కెరీర్ సాగిస్తున్న ఆ వ్యక్తి పేరు జునైద్ షా. కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన జునైద్ చూడటానికి అచ్చం రణబీర్ లాగే ఉంటాడు. అలాంటి జునైద్ అకస్మాత్తుగా మరణిచాడు. యుక్త వయస్సులోనే అతను గుండెపోటుతో మృతి చెందాడు. జునైద్ షా మృతి చెందిన విషయాన్ని కశ్మీర్ జర్నలిస్ట్ యూసుఫ్ జమీల్ తెలిపారు. నిస్సార్ అహ్మద్ షా కొడుకైన జునైద్ హీరో రణబీర్ లా ఉంటాడని అంతా పిలిచేవారు. జునైద్ ఇలా అనుకోకుండా మృత్యువాత పడటం ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. గత నెలలోనే ముంబైకు వెళ్లాలని 28 ఏళ్ల జునైద్ కు జర్నలిస్టు యూసుఫ్ సలహా ఇచ్చాడట. ముంబైలోనే మోడలింగ్ చేసుకుంటూ అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో నటనపై శిక్షణ తీసుకోవచ్చని తెలిపాడు. కానీ ఇంతలోనే జునైద్ చనిపోయాడని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అతనికి హార్ట్ కి సంబంధించిన వ్యాధులు కూడా ఏమి లేవని యూసుఫ్ పేర్కొన్నాడు. ఇలా అతి చిన్న వయస్సులోనే జునైద్ చనిపోవడం బాధాకరం.

Related posts