telugu navyamedia
సినిమా వార్తలు

బేగంపేట ఎయిర్‌పోర్టులో మొక్క‌లు నాటిన అమీర్‌ఖాన్‌, నాగచైతన్య

కోట్ల హృదయాలను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’కి విశేష స్పందన లభిస్తోంది. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను స్వీకరించిన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ భాగ్యనగరంలో మొక్కలను నాటారు.

green India challenge:Aamir Khan plants saplings at Begumpet Airport along with Tollywood actor Akkineni Nagachaitanya and MP Santosh Kumar.

ఈరోజు హైదరాబాద్ చేరుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్, విలక్షణ చిత్రాల హీరో అమీర్ ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా మూవీలోని సహనటుడు అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటారు.

green India challenge:Aamir Khan plants saplings at Begumpet Airport along with Tollywood actor Akkineni Nagachaitanya and MP Santosh Kumar.

ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్ లను మనం చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ను మనకు అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరం అప్పనిసరిగా మొక్కలు నాటాలి, వాటిని బాధ్యతగా పెంచాలి. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరు భాగస్వాములై మొక్కలు నాటాలని దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని అమీర్ ఖాన్ అన్నారు.

అమీర్ ఖాన్ తాజా సినిమా లాల్ సింగ్ చద్దా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ హైదరాబాద్ చేరుకున్నారు

అలాగే.. ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో అందరు భాగస్వాములై మొక్కలు నాటాలని దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని అమీర్ ఖాన్ పిలుపునిచ్చారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరు భాగస్వాములై మొక్కలు నాటాలని దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరు పాటుపడి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని అమీర్ ఖాన్ పిలుపునిచ్చారు.

హరిత తెలంగాణ దిశగా ఎంపీ సంతోశ్​ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో​ ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​ ప్రముఖులు, క్రీడాకారులు భాగస్వాములయ్యారు. ఈ ఛాలెంజ్​లో భాగంగా… ఇప్పటికే 16 కోట్లకు పైగా మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రజలు పండగలా జరుపుకునే ఏ సందర్భం వచ్చినా.. అందులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాగం చేస్తూ ఎంపీ సంతోష్​ హరిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నారు.

 

Related posts