నటి అమీజాక్సన్ మలివయసులో కూడా హాట్ ఫొటోలతో యువత గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. కోలీవుడ్‌లో మదరాసు పట్టణం చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రిటీష్ బ్యూటీ ఆ తరువాత ఇక్కడ వరుసగా చిత్రాల్లో నటించింది. ఆర్యకు జంటగా నటనకు శ్రీకారం చుట్టిన అమీజాక్సన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 2.ఓ చిత్రం వరకూ ఏకధాటిగా సాగింది. తెలుగు, హిందీ భాషల్లోనూ పరిచయం అయ్యింది. అయితే ఈ రెండు భాషల్లో పెద్దగా రాణించలేదు గానీ, తమిళంలో క్రేజీ హీరోయిన్‌గానే వెలిగింది. అలాంటిది ఇక్కడ రజనీకాంత్‌తో జత కట్టిన 2.ఓ చిత్రమే చివరిదిగా నమోదైంది. కారణం లండన్‌కు చెందిన జార్జ్ ఫెర్నాండ్ అనే వ్యాపారవేత్త ప్రేమలో పడింది. అలా పెళ్లి కాకుండానే తల్లి కూడా అయిపోయింది. గత ఏడాది సెప్టెంబర్ 23న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడికి ఆండ్రియోస్ అని నామకరణం చేసింది. ఇకపోతే గర్భవతి అయిన తరువాత నటనకు స్వస్తి చెప్పిన అమీజాక్సన్ తన గ్లామరస్ ఫొటోలను మాత్రం మీడియాకు విడుదల చేస్తూ వార్తల్లో ఉంటూనే ఉంది.
ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుటి దృశ్యాలను కూడా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు తన పొత్తికడుపుతో ఉన్న బిడ్డను కూడా ప్రపంచానికి పరిచయం చేసేసింది. అంతటితో ఆగలేదు ఇప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తోంది. ఒక బిడ్డకు తల్లినన్న విషయాన్ని కూడా మరిచి తాజాగా ఈత దుస్తులతో వర్షంలో నిలబడ్డ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నటనకు గుడ్‌బై చెప్పినా అమీజాక్సన్ గ్లామర్‌ను ప్రదర్శించడంలో అసలు తగ్గడం లేదుగా అని ఒక వర్గం కామెంట్స్ చేస్తుంటే, మరి కొందరు ఏ ఉద్దేశంతో ఇలాంటి ఫొటోలను సోషల్ మీడియాకు విడుదల చేస్తోంది, మళ్లీ నటించాలని కోరుకుంటోందా? అని అంటున్నారు. ఏదేమైనా ఎమీ మాత్రం ఏదో విధంగా వార్తల్లో ఉండే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆడ్రస్ లేవు: ఎమ్మెల్యే సీతక్క