ప్రభాస్ సాహో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతా సిద్ధం అయ్యింది. బాహుబలి రేంజ్‌లోనే సాహో చిత్రం కూడా తెరకెక్కడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన వీడియోలు ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగించాయి. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 30న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకి అభిమానులు కూడా భారీగానే తరలి రానున్నారు.
ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లని చిత్రబృందం పరిశీలిస్తుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో సాహో చిత్రం తెరకెక్కగా, ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించింది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, లాల్ వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ చిత్రానికి పని చేయడం విశేషం.
అనసూయ గుండె బద్ధలైందట… ఎందుకంటే..?