ప్రముఖ సింగర్, నటి స్మిత ఫేస్ బుక్‌లో పిచ్చి పిచ్చి పోస్ట్‌లు దర్శనం ఇవ్వడంతో ఆమె ఫాలోవర్స్ ఆందోళలకు గురయ్యారు. అసభ్యకరమైన పోస్ట్‌లతో పాటు ఎవరెవరివో న్యూడ్ ఫొటోలు దర్శనం ఇవ్వడంతో షాక్ తిన్నారు. అయితే తన ఫేస్ బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారంటూ ట్విట్టర్ ద్వారా తెలిపింది సింగర్ స్మిత. దీంతో స్మిత సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే స్మిత ఫేస్ బుక్ ఖాతా తిరిగి సాధారణ స్థితికి రావడంతో ఐ యామ్ బ్యాక్ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఫేస్ బుక్ ద్వారా జరిగిన విషయాన్ని తెలియజేసింది. ‘ఇదో భయంకరమైన రోజని.. తన ఫేస్ బుక్‌ని హ్యాక్ చేసి స్టుపిడ్ కంటెంట్ పోస్ట్ చేశారని.. వాటి వల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించాలని కోరింది స్మిత. తన ఫేస్ బుక్ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి సహకరించిన ఫేస్ బుక్ టీం అందరికీ ధన్యవాదాలు తెలిపింది స్మిత. పాప్ సింగర్‌గా క్రేజ్ సంపాదించిన సింగర్ స్మిత తన ఈవెంట్స్‌కి సంబంధించిన విషయాలనే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ తన వాయిస్ వినిపిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
previous post