telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు తండ్రిగా బాలయ్య ?

NTR

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న తారక్ ఆ సినిమాకు సంబంధించిన వర్క్‌ని మే వరకు పూర్తి చెయ్యనున్నారు. తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈలోపు పూర్తి కథను సిద్ధం చేసి త్రివిక్రమ్ తారక్‌కి వినిపించనున్నారట. ఈ సినిమా షూటింగ్ కూడా ఆగస్ట్ నుంచి మొదలు పెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో బాలయ్యను ఎంపికచేసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో నటించలేదు. అలాంటిది త్రివిక్రమ్ సినిమా కోసం బాలయ్య వస్తారన్న ఆశలు కూడా ఫ్యాన్స్‌లో లేవు. దాంతో కనీసం ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం లేకపోయినా బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల్లో బాలయ్య కనిపించినా చాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. అంటే ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్‌కు బాలయ్య తండ్రిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇది నిజం అయితే.. ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు.

Related posts