telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నా గురించి గాసిప్ చేయడానికి వాట్సాప్ గ్రూపులు…” సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్

Sunita

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ సింగర్ సునీత. ‘గులాబీ సినిమాలో ఈవేళలో నీవు ఏం చేస్తుంటావు..’ అనే పాటతో తన సినీ పయాణాన్ని మొదలు పెట్టిన సునీత.. అతి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తాజాగా తనని కారణం లేకుండా టార్గెట్ చేశారని ఫేస్‌బుక్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. “కనీస కారణం లేకుండానే అతి సులభంగా నన్ను టార్గెట్ చేసిన వారిని చూశాను. నా గురించి గాసిప్ చేయడానికి వాట్సాప్ గ్రూపులు సృష్టించబడటం నేను చూశాను. కొన్ని వెబ్‌సైట్లు నా గురించి అర్థంపర్థంలేనివి రాయడం నేను చూశాను. నా వ్యక్తిగత జీవితం గురించి మహిళలు పుకార్లు చేయడం కూడా నేను చూశాను. నా జీవితంలో విజయాలు, అపజయాలు చూశాను. మౌనంగా ఉంటూ జీవితానికి సరిపడా చేసేశా. పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కొంటూ.. ఒంటరిగా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు. మొత్తానికి నేను జీవితాన్ని చూశాను. ఇవన్నీ నా జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి” అని సునీత ఫేస్‌బుక్ పోస్టులో రాసి.. ఓ వీడియోను షేర్ చేశారు సునీత. కాగా నా పుట్టిన రోజు సందర్భంగా నన్నెంతో అభిమానించేవారు నాకోసం ఇప్పుడు ఒక్కటయ్యారు. నా పని తీరును గుర్తు చేసి అభినందించారు. నా ఉనికికి కారణం చెప్పారు. వీరంతా కలిసి నా జీవితానికి మరింత అర్థం తెచ్చారు. మీ అందరికీ నా ధన్యవాదాలు” అని తెలిపారు సునీత.

Related posts