telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను ప్రభాస్‌ని లవ్ చేయడం లేదు : నిహారిక

Niharika

ఈ లాక్‌డౌన్ సమయంలో తాజాగా కొణిదెల నాగబాబు కూతురు నిహారికను ఇంటర్వ్యూ చేసిన ఓ మీడియా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా డాటర్ నిహారిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలపై నిహారికకు ప్రశ్నించగా  దానికి స్పందిస్తూ ఐ యామ్ సారీ టు డిజప్పాయింట్, నేను ప్రభాస్‌ని లవ్ చేయడం లేదు అని సింపుల్‌గా చెప్పేసింది. తన ఫ్యామిలీ అందరిలో బెస్ట్ కజిన్ వైష్ణవ్ తేజ్ అని, చిన్నప్పటి నుంచే వైష్ణవ్‌‌తో ఫుల్ క్లోజ్‌గా ఉండేదాన్నని, వైష్ణవ్ మనసు వెన్న అని చెప్పుకొచ్చింది నిహారిక. అలాగే సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడిన నిహారిక. తేజ్ బావ తనను పేరు పెట్టి పిలిచిన సందర్భం ఒక్కటి కూడా గుర్తులేదని చెప్పింది. నిహా తల్లి అని మాత్రమే అంటాడని, రియల్లీ లవబుల్ పర్సన్ అనేసింది. అత్త కొడుకు కాబట్టి తేజ్‌ని బావ అని పిలుస్తానే తప్ప, తనకు అన్నలాగే అని చెప్పుకొచ్చింది నిహారిక. ఫిమేల్ కజిన్స్‌లో శ్రీజ బెస్ట్ ఫ్రెండ్ అని, స్నేహారెడ్డి కూడా బాగా కలిసిపోతుందని తెలిపింది నిహారిక. ఇక వయసులో పెద్దదైన చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత అక్క వాళ్ళింట్లో ఎక్కువ సమయం గడుపుతానని, తను బాగా క్లోజ్ అని తన సీక్రెట్స్ మొత్తం ఆమెకే తెలుసని చెప్పి షాకిచ్చింది నిహారిక.

Related posts