telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వెంకీ మామ” ట్విట్టర్ రివ్యూ

Venky-Mama

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందిన మ‌ల్టీస్టారర్ “వెంకీమామ‌”. విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య నటించారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకాల‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు విపరీతమైన ప్రచారం కల్పించారు. తనకు ఇది మరో ‘మనం’ అంటూ నాగచైతన్య చెబుతున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ, వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ‘వెంకీమామ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూఎస్‌లో ఇప్పటికే ‘వెంకీమామ’ ప్రివ్యూ షోలు ప్రారంభమైపోయాయి. చాలా మంది అక్కడ సినిమాను చూసేశారు. వాళ్లంతా ట్విట్టర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే అక్కడ నుంచి రివ్యూలు అందించే సినీ విమర్శకులు మాత్రం సినిమాపై పెదవి విరుస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు మాత్రం కామెడీ, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యాయని, వెంకటేష్ మరోసారి తన పెర్ఫార్మెన్స్ మెస్మరైజ్ చేశారని చెబుతున్నారు. ఫస్టాఫ్‌లో కామెడీ, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయని ట్వీట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా అదిరిపోయిందట. మామా అల్లుళ్లలో వెంకటేష్‌దే పైచేయి అని అంటున్నారు. కథలో వెంకటేష్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉందట. నాగచైతన్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని చెబుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఆర్మీ సీన్లలో చైతన్య యాక్టింగ్ సూపర్ అంటున్నారు. హీరోయిన్లు రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నాయట. కథలో కొత్తదనం ఏమీ లేదని, స్క్రీన్‌ప్లే కూడా అంత గొప్పగా లేదని చెబుతున్నారు. తమన్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే సినిమాను అబౌవ్ యావరేజ్ మూవీగా ఈ ట్విట్టర్ సినీ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.

Related posts