telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు నివాసం కూల్చివేతకు.. నోటీసులు జారీ చేసిన సీఆర్డీఏ!

almost no security at chandrababu house

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు. ఉండవల్లిలోని ప్రజావేదికను అక్రమంగా నిర్మించారంటూ దాన్ని కూల్చివేయాలంటూ జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడం జరిగింది. అక్రమ కట్టడాల జాబితాలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసేందుకు కరకట్టలోని ఆయన నివాసానికి సీఆర్డీఏ అధికారులు చేరుకున్నారు.

నోటీసులు జారీ చేసేందుకు సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి బాబు నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. ఇళ్లు ఖాళీ చేయించి పడగొట్టాలని లేనిపక్షంలో ప్రభుత్వమే కూల్చివేస్తుందని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు ఆదేశించారు. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే భవనాలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Related posts