telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ నుంచి కియా మోటార్స్ తరలింపు?

kia-motors

ఆంధ్రప్రదేశ్ నుంచి కియా మోటార్స్ ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనం ప్రచురితమైంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన తమ 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంటును తమిళనాడుకు తరలించే యోచనలో ఈ సంస్థ ఉన్నట్టు ఆ కథనం సారాంశం. కియా మోటార్స్ పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించిన నెలల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

కియ పరిశ్రమకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చింది. ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చివరకు ఏపీలో పరిశ్రమ ఏర్పాటుకు కియ మొగ్గు చూపింది. ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 15 వేల మందికి.. పరోక్షంగా మరో 40 వేల మందికి లబ్ధి చేకూర్చనుంది. కియ పరిశ్రమకిచ్చిన రాయితీలపై ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. స్థానికంగా బెదిరింపులు వస్తున్నాయని గతంలోనే కియ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.

Related posts