తృణమూల్ కాంగ్రెస్ కోల్‌కతాలో పెద్ద సంఖ్యలో ఉన్న చైనా మూలాలున్న ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్తరకం ప్రచారం ప్రారంభించింది. వారి ఓట్లను కొల్లగొట్టేందుకు చైనా భాషలో ప్రచారం ప్రారంభించింది. ఎక్కడికక్కడ గోడలపై ‘తృణమూల్ కాంగ్రెస్‌కే ఓటేయండి’ అని రాసి ముఖ్యమంత్రి మమత బెనర్జీ, పార్టీ ఎన్నికల చిత్రాలను వేశారు.
టీఎంసీ ఈ సరికొత్త ప్రచారం వెనుక నగరంలోని తాంగ్రాలో చైనా సంతతి ప్రజలు 2 వేల మంది వరకు నివసిస్తుండటమే కారణం. అంతేకాదు, చైనా భాషలో కరపత్రాలు కూడా ముద్రించి పంచనున్నట్టు టీఎంసీ నేత ఒకరు తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న చైనా సంతతి వారికి హిందీతోపాటు స్థానిక భాషలు వచ్చినప్పటికీ వారి మాతృభాషలో ప్రచారం చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించబట్టే ఈ ప్రచారానికి దిగినట్టు ఆయన పేర్కొన్నారు.
పవన్ రక్తం అంటూ నెటిజన్ కామెంట్… రేణూ దేశాయ్ ఘాటు స్పందన